రైతు భరోసా నిధులపై తెలంగాణ ప్రభుత్వం శుభవార్త

  • భూపాలపల్లి జిల్లాలో విడుదల చేయనున్న సీఎం రేవంత్ రెడ్డి
  • రెండో విడతలో 45,11,947 మంది రైతులకు రూ.5,653 కోట్ల నిధులు విడుదల
  • మార్చి 22న తొలి విడత నిధులు సిద్దిపేట జిల్లాలో విడుదల చేసిన సీఎం
రైతులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రెండో విడత రైతు భరోసా నిధులను ప్రభుత్వం త్వరలో విడుదల చేయనుంది. ఈ నెల 20వ తేదీన భూపాలపల్లి జిల్లా కాటారం బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నిధులను విడుదల చేయనున్నారు.

రెండో విడతలో 45,11,947 మంది రైతులకు రూ.5,653 కోట్ల నిధులను వారి వారి ఖాతాల్లో జమ చేయనున్నారు. మార్చి 22వ తేదీన సిద్దిపేట జిల్లా నర్మెటలో జరిగిన బహిరంగ సభలో తొలి విడతగా 1.50 కోట్ల ఎకరాలకు రూ.3,590 కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేశారు. ఈ క్రమంలో, రైతులు రెండో విడత రైతు భరోసా నిధుల కోసం ఎదురుచూస్తున్నారు.

Revanth Reddy
Rythu Bharosa
Telangana
Telangana government
Farmer investment support scheme

More Telugu News